అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
భక్తిరస భరితం.. కుబేరుని వృత్తాంతం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం కాశీఖండంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త ఎంవీ సత్యవతి ప్రవచిస్తూ శ్రీనాథ మహాకవి రచిం చిన కాశీఖండంలో కుబేరుని వృత్తాంతం అత్యంత భక్తిరసపూరితంగా వర్ణించబడిందని అన్నారు. శివుడికి, కుబేరుడికి మధ్య ఉండే అచంచలమైన మైత్రికి ఈ కథ ఒక చక్కని నిదర్శనమని పేర్కొన్నారు.
.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి