ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

నవంబర్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం - 04.11.2025

ఆకట్టుకున్న అభిజ్ఞాన శాకుంతలం స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం నిర్వహించిన అభిజ్ఞాన శాకుం తలం నృత్యరూపకం ఆకట్టుకుంది. మహాకవి కాళిదాసు జయంతి సందర్భంగా సంస్కృత భారతి గుంటూరు శాఖ, శ్రీ సాయిమంజీర కూచి పూడి ఆర్ట్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నాటకంలోని సన్నివేశాలను డాక్టర్ కాజ వేంకట సుబ్రహ్మణ్యం నిర్వహణలో విద్యార్థినులు అభినయం చారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు పి. వరప్రసాదమూర్తి, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, హిందూ కళాశాల పూర్వ ప్రధానాచార్యులు డాక్టర్ దీవి నరసింహదీక్షిత్, గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి, పత్రి వేణుగోపాల్, విభాగ సంయోజక్ పెసల దేవేంద్రగుప్తా, ఉదయ కిరణ్, జన్నాభట్ల ఉమా, ఫణికామేశ్వరి తదితరులు ప్రసంగించారు.

అలరించిన అన్నమాచార్య సంకీర్తనామృతం - 03.11.2025

అలరించిన అన్నమాచార్య సంకీర్తనామృతం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం సూరపనేని శ్రీకాంత్ ఎండోమెంట్ కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, భజన బృందం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవత్స భజనమండలి తెనాలి, కొండపి వసుంధర బృందంచే అన్నమాచార్య సంకీర్తనల గానం శ్రావ్యంగా సాగింది. వీరికి కీబోర్డుపై రామకృష్ణ, తబలపై వెంకటరమణ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. ఆలయ కమిటి సభ్యులు సూరపనేని శ్రీరామచంద్రమూర్తి , జయలక్ష్మి ల నిర్వహణలో భజన బృందం వారిని ఘనంగా సత్కరించారు.

ఆకట్టుకున్న శ్రీకృష్ణ రాయబారం హరికథాగానం - 01.11.2025

ఆకట్టుకున్న శ్రీకృష్ణ రాయబారం హరికథాగానం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం కళ్ళం హరనాథరెడ్డి గారి జయంతి సందర్భంగా శ్రీకృష్ణ రాయభారం హరికథాగానం కార్యక్రమం జరిగింది. తొలుత కళ్ళం హరనాథరెడ్డి కుటుంబసభ్యులు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, జాగర్లమూడి మల్లికార్జునరావు తదితరులు హరనాథరెడ్డి గారి చిత్రపటానికి పూలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ హరికథకురాలు వేదవతి భాగవతారిణి హరికథను ప్రారంభిస్తూ ఇది మహాభారతంలోని కృష్ణుడు శాంతిస్థాపన కోసం దుర్యోధనుడి సభకు రాయబారిగా వెళ్లిన సన్నివేశంపై ఆధారపడి ఉంటుందని, ఈ కథను శ్రీకృష్ణుడు రాయబారంలో చూపిన చాతుర్యం, ధర్మం, కౌరవ సభలోని సన్నివేశాలను వర్ణిస్తూ తన బాణీలో పలు పద్యాలను ఆలపించి శ్రీకృష్ణ రాయభారంలో కృష్ణుడు చూపిన దౌత్యం, ధర్మం, దుర్యోధనుడితో జరిగిన సంభాషణలు ప్రధానాంశాలుగా తీసుకొని హరికథ రూపంలో తెలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  వీరికి తబలపై నాగప్రసాద్, కీబోర్డుపై మల్లేశ్వరరావు లు చక్కటి  వాయిద్య సహకారం అందించారు.