ఆకట్టుకున్న కూచిపూడి నృత్యం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శ్రీ సాయిమంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో కాజ సత్యవతీదేవి నరసింహారావు మెమోరియల్ బాల కళావేదిక నిర్వహణలో 16వ చిల్డన్స్ డ్యాన్స్ ఒలంపియాడ్ కార్యక్రమంలో శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన సీనియర్స్ విభాగానికి చెందిన కూచిపూడి నర్తకిమణుల పోటీలో పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శన చేసిన కళాకారులకు బాల కళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు డాక్టర్ భూసుపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. అతిథులుగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, డాక్టర్ పి. నాగశ్రీహరిత, కాజా శ్యాంసుందరరావు, సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచార్య డాక్టర్ కాజ వెంకటసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని పెద్దిరాజు హర్షిత, మంగల సుధాశాన్వి, నారా లక్ష్య, గాజుల లోచన శ్రీవర్షిత, గోండి హన్వికశ్రీ, ఆదిరాజు హృతిక, తిరునగరి సుహిత లను బాలకళారత్న పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని గరికపాటి శిరీష, గన్నె ప్రసన్న పర్యవేక్షించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి