ఆకట్టుకున్న కీర్తనల గానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం రాత్రి భక్తి మాల పేరుతో నిర్వహించిన గీతాలాపన కార్య క్రమం ఆకట్టుకుంది. తొలుత ఆలయపాలక మండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతివెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యిమ్మడి అంజనీదేవి, చింతలపాటి రమామహేశ్వరి, సోనాముఖి, పావని, హేమకుసుమ, లక్ష్మీదేవి, జీవనజ్యోతి, దుర్గ, పార్వతి, సుభాషిణి, యశోద, ఉష, ఉమ, నాగరవళి, లోకేశ్వరి, భారతి, కామాక్షి, సుజాత, లక్ష్మీకుమారి, భారతి, ముర ళీకృష్ణ, బ్రహ్మేశ్వరిలు పలు కీర్తనలు ఆలపించారు. వీటికి డాక్టర్ తాతా గిరిజా శేషమాంబ స్వరకల్పన చేశారు. మల్లికార్జునరావు పర్యవేక్షించారు.
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి