నిరంతర కళావాహిని - అన్నమయ్య కళావేదికపై ఏడాది పొడవునా కార్యక్రమాలే
అన్నమయ్య కళావేదిక.. అదొక నిరంతర కళావాహిని గుంటూ రుతో పాటు ఇతర జిల్లాల కళాకా రులకు ఈ పేరు పరిచయమే. గుంటూరు బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నిర్మితమైంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి దేవా లయం ఎలా ఏడాది పొడవునా భక్తులకు దైవదర్శన భాగ్యం కలిగి స్తుందో.. అలాగే ఒక్క రోజూ కూడా ఆగకుండా సాంస్కృతిక, కళా సాహిత్య కార్యక్రమాలను ఈ వేదిక అందిస్తుంటుంది. ఇక్కడ ప్రదర్శన, ఇరత కార్యక్రమాల నిర్వహణకు మూడు నెలల ముందే వేదిక తేదీలను నమోదు చేసుకోవాలి. ఈ దైనందిన కార్యక్రమాలను మొక్కుబడిగా ఎవరో ఉద్యోగికి అప్పగించి ఊరుకోరిక్కడ. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య.. ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ప్రదర్శింపజేయాలి, భక్తులకు అవి ఏమేరకు ఉపకరిస్తాయనే అంశాలు పర్యవేక్షిస్తుంటారు. సభ్యులు కూడా నిర్వహణకు కావాల్సిన అంశాలను చూస్తుంటారు.
వర్షాలొచ్చినా ఆగకుండా.. అన్నమయ్య కళావేదికపై ప్రదర్శించే కార్యక్రమాల కోసం సాయంత్రం ఆరు గంటల కల్లా వంద నుంచి 200 మంది ప్రేక్షకులు వేచి చూస్తుంటారు. ప్రేక్షకులకు అనువైన కుర్చీలు తదితర సౌకర్యాలు సిద్ధంగా ఉంటాయి. ప్రద ర్శనలిచ్చే వారికి వేదిక తదితరాలన్నీ ఉచితమే. ఇది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం. వర్షాలొచ్చినా కార్యక్రమాలు ఆగకుండా తగిన ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. పాలక మండలిలో ఉపాధ్యక్షురాలిగా సేవలందిం చిన గద్దె రామతులశమ్మ వేదిక నిర్మాణానికి సహకరించారు.
ఇటీవల కొవిడ్ సమయంలో లాక్ డౌన్ ప్రకటించినప్పుడు మినహా 2000 సంవత్సరం నుంచి నేటి వరకు ప్రతి నిత్యం సంగీతమో, నృత్యమో, ఉపన్యాసమో, నాటకమో, కళారూపమో ప్రదర్శితమవుతుంది. కార్యక్రమాలు లేకపోతే ప్రవచనకర్తలతో ఆధ్యాత్మిక ప్రసంగాలు, కళాకారులతో కచేరీలు ఏర్పాటు చేస్తుంటారు. కవులు, కళాకారులు, రచయితలకు ఇదొక ఆత్మీయ వేదికగా.. తెలుగు కళ, భాషా సంస్కృతుల నిధిలా కొనసాగుతూనే ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి