అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
అనువాదం చాలా కష్టమైన పని
ప్రముఖ పరిశోధకులు ఆచార్య
గంగప్ప సాహితీ పురస్కార సభలో ముఖ్యఅతిథిగా జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్
మాట్లాడుతూ అనువాదం అనేది చాలా కష్టమైన పని అని తెలిపారు. సాహిత్యంలో ఒక భాష నుండి
మరొక భాషలోకి అనువదించేటప్పుడు భావం తప్పనిసరిగా రావాలి అని ఉద్ఘాటించారు. స్థానిక
బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై
గురువారం ఆచార్య గంగప్ప స్మారక పురస్కార సభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన గోళ్ళ
నారాయణరావు మాట్లాడుతూ పురస్కార గ్రహీత వెన్నా వల్లభరావు ఆకాశవాణిలో 50 నాటికలు,
నాటకాలు ప్రదర్శించారని తెలిపారు. నల్లనివాడు అనే రెడియో నాటకానికి జాతీయ అవార్డు
అందుకున్నారన్నారు. డాక్టర్ గుమ్మా సాంబశివరావు మాట్లాడుతూ డాక్టర్ వల్లభరావు
కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందారన్నారు. త్రిపురనేని రామస్వామి,
పింగళి వెంకయ్యల జీవితాలను తెలుగులోను, హిందీలోను వ్రాశారన్నారు. జస్టిస్
రామకృష్ణప్రసాద్ పురస్కర గ్రహీతను ఘనంగా సత్కరించి 5 వేల రూపాయల నగదు అందజేశారు.
సభలో ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, కందిమళ్ళ సాంబశివరావు, వెన్నిశెట్టి
సింగారావు, చిట్టినేని శివకోటేశ్వరరావు, అశోక్‌రెడ్డి, షేక్ మస్తాన్, యస్. మురళి,
సుబ్రహ్మణ్యం, సుష్మా తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ యన్.వి. కృష్ణారావు వందన
సమర్పణ చేశారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి