షట్కాల శివలింగార్చన ప్రాముఖ్యత
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కార్తీకమాసం సందర్భంగా షట్కాల శివలింగార్చన పై ఆధ్యాత్మిక ప్రవచన జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు, తూనుగుంట్ల రాధాబాయి, వెలువోలు నాగరాజ్యలక్ష్మి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి ప్రవచిస్తూ షట్కాలం అంటే ఆరు సమయాలలో శివలింగాన్ని పూజించడమన్నారు. శైవ ఆగమాల ప్రకారం, శివాలయాలలో, ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న పెద్ద దేవాలయాలలో, ఈ షట్కాల అర్చనను నిష్ఠగా ఆచరిస్తారన్నారు. ఈ ఆరు కాలాల్లో శివుడిని పూజించడం వల్ల సృష్టి, స్థితి, లయ అనే త్రిమూర్తుల కార్యాలు సక్రమంగా జరుగుతాయని, భక్తులకు మోక్షం లభిస్తుందని నమ్ముతారన్నారు. ఈ ఆరు కాలాలలో శివలింగానికి అభిషేకం, అలంకరణ, ధూప, దీప, నైవేద్య సమర్పణ మరియు మంత్ర పఠనంతో పూజ చేస్తారన్నారు. ఈ షట్కాల అర్చన హిందూ ఆగమ శాస్త్రాలలో, ముఖ్యంగా శైవ సంప్రదాయంలో, చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందని తెలిపారు. డాక్టర్ తూనుగుంట్ల నాధాభాయి భారతీయ దృక్పధంలో పర్యావరణం అనే అంశంపై ప్రసంగించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి