కనులపండువగా కుమార సంభవం(శివకళ్యాణం) నృత్యరూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కార్తీకమాసం సందర్భంగా గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కుమార సంభవం కూచిపూడి నృత్యరూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, గుళ్ళపల్లి సుబ్బారావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ నృత్య ఆర్ట్ అకాడమి, విజయవాడ నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామశర్మ శిష్యబృందంచే కుమార సంభవం నృత్యరూపకం కనులపండువగా జరిగింది. తారకాసుర సంహారం కొరకు శివ పార్వతుల వివాహము, కుమార స్వామి జననం వంటి అనేక అంశాలను చక్కటి హావభావాలతో కళాకారులు ప్రదర్శించారు. అనంతరం సంస్థ వారు భాగవతుల వెంకటరామశర్మ దంపతులను, శిష్యబృందాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలను గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ కన్వీనర్ రాఘవరావు పర్యవేక్షించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి