ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జులై, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన - సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 28.07.2025

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన - సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 28.07.2025

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.

వైభవంగా గోదా అమ్మవారికి శ్రీ పుష్పయాగం - 28.07.2025

వైభవంగా గోదా అమ్మవారికి శ్రీ పుష్పయాగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరునక్షత్ర సందర్భంగా సోమవారం అమ్మవారికి శ్రీ పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సూరెడ్డి రాంప్రసాద్, పద్మజ దంపతుల సౌజన్యంతో, పాలకవర్గ సహాయ సహకారాలతో, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు తో విశేష అభిషేకాలు, అర్చనలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరణ జరిగాయి. మల్లె, జాజి, బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ, గులాబి, సంపంగి, తులసి దళాలు తదితర ఏడు క్వింటాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. హరి సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొన్నారు.

అలరించిన సినీ భక్తి సంగీత విభావరి

అలరించిన సినీ భక్తి సంగీత విభావరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికగా ఆదివారం మహతి స్వరసుధ వ్యవస్థాపకురాలు పత్రినిర్మల ఆధ్వర్యంలో రజతోత్సవాలలో ఏడవ భక్తి సినీ సంగీత విభావరి జరిగింది. గౌరవ అతిధులుగా పాల్గొన్న కొల్లూరు వేణుగోపాలరావు, అరుణకుమారి దంపతులు, కొంజేటి శివనాగప్రసాద్, దండా మోహన్‌రావు, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీసంగీత విభావరిలో గాయని గాయకులు పత్రినిర్మల, అన్నపూర్ణ, ముకుంద ప్రియ, హారిక గోవిందరాజు, శరణ్యప్రతాప్, రసూల్ బాబు, వలి, డాక్టర్ వీరఆతుకూరి, కృష్ణప్రసాద్ తదితరులు అలనాటి చిత్రాలలోని సినీ భక్తి గీతాలను  వీనుల విందుగా గానం చేసి ఆహుతులను అలరించారు. వీరికి కీబోర్డ్ పై కే. రవిబాబు, తబలా పై ఎస్. వెంకట్, పాడ్స్‌పై  టీ. ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. ప్రధాన కార్యదర్శి కే. మదన్మోహన్ రావు కార్యక్రమాన్ని నిర్వహించారు.

అలరించిన గాత్రకచేరి - 26.07.2025

అలరించిన గాత్రకచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య కళావేదికపై ప్రముఖ గాయకురాలు రాగమయూరి నిర్వహించిన గాత్రకచేరి అలరించింది. నాగార్జున సంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళాశాల సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేజీ శంకర్ ప్రారంభించారు. రాగమయూరి పలు త్యాగరాజ కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి మృదంగంపై రామకృష్ణ, వయోలిన్‌పై చావలి శ్రీనివాస్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాన్ని సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి కే.సూర్యనారాయణ పర్యవేక్షించారు.

గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయం - 25.07.2025

గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళాస్రవంతి సాహితీ సాంస్కృతిక స్సంస్థ అధ్యక్షులు డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ ఆధ్వర్యంలో శుక్రవారం S “వికోకిల గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు.సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తాళ్ళూరి వెంకట రత్నారావు సభా పరిచయం చేసారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్, ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు డొక్కామాణిక్యవరప్రసాద్, తెలుగుశాఖ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆచార్య ఇరవని మాధవి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సభానంతరం గవర్నర్ అవార్డు గ్రహీత డాక్టర్ పెద్దీటి యాహూను, జాతీయ అవార్డు గ్రహీత, తెనాలి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, విశ్రాంత ఏం.ఈ.ఓ, వినుకొండ సి.హెచ్.జాన్ సుందరరావులను ముఖ్య అతిధి,అతిధులు, సంస్థ వారు కలిసి ఘనంగా సత్కరించారు. పాల్గొన్న అతిధులను కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ప్రభుదాస్ కార్యవర్గం వారు సత్కరించారు

సమాజ మార్గదర్శి భగవద్గీత - 24.07.2025

సమాజ మార్గదర్శి భగవద్గీత స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై గురువారం భగవద్గీత జ్యోతి-మనో మార్గదర్శి జుగల్బందీ వ్యాఖ్యాన పూర్వక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. కోట రామలక్ష్మి భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. భగవద్గీతలోని అంతరార్ధాలను విపులంగా వివరిం చారు. కాటూరి వైద్య కళాశాల మానసిక వైద్య అధ్యాపక వైద్యులు కోట సురేష్కుమార్ భగవద్గీతలోని పాత్రలు, వారి ప్రవర్తన, సుఖ దుఃఖాల సమాహారాన్ని, మానసిక స్థితులను తెలియజేశారు. భగవద్గీతను అనుసరించి నేటి కాలంలో మానవులు అనుసరించాల్సిన నీతి, నియమాలను తెలిపారు.

విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ - 23.07.2025

విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై అన్నమయ్య సేవాసమితి ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి నుంచి పీజీ చదివే విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. సుమారు నలభై మంది విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అందిం చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు పాల్గొన్నారు.

భక్తి శ్రద్ధలతో చండీ హోమం - 23.07.2025

భక్తి శ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా బుధవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ గణపతి, రుద్ర, చండీ హోమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 9 మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తీర్థ మహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 20.07.2025 - 23.07.2025

తీర్థ మహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం స్థానిక బృందావన్ గార్డెన్స్  శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై మహాభారతం అరణ్యపర్యంలోని తీర్థమహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రసంగిస్తూ అరణ్యపర్వంలో ధర్మరాజు నారదమహర్షిని తీర్థమహత్యాలను తెలువమని అడగ్గా, పూర్వ పులస్త్యుడు భీష్ముడికి చెప్పిన తీర్థరాజ మహాత్యాలను వివరించారని అన్నారు. మహాభారతంలో తీర్థ మహత్యమనేది తీర్థయాత్రల ప్రాముఖ్యత, మహిమను వివరిస్తుందని పేర్కొన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణమని, ఇక్కడ పాండవులు తీర్థయాత్రలు చేసి పవిత్ర స్థలాలను సందర్శిస్తారని చెప్పారు. ఈ ప్రయాణంలో వారు నదులు, సరస్సులు, పుణ్యక్షేత్రాలను సందర్శించారని పేర్కొన్నారు. తీర్థయాత్రలు వారి జీవితాలపై, ఆధ్యాత్మిక ఎదుగుదలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహాయపడతాయని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారని పేర్కొన్నారు. తీర్థ యాత్రలకు వెళ్లేటప్పుడు వాటి ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకో...

అలరించిన నృత్యనీరాజనం - 19.07.2025

అలరించిన నృత్యనీరాజనం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై నాట్యాచారిణి కుబేరినీ శిష్యబృందంచే శనివారం జరిగిన నృత్యనీరాజనం కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన  చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ నృత్య కళ పట్ల అంకితభావం, నైపుణ్యంతో ఉత్తర కరోలినీ, అమెరికా వాస్తవ్యులు చిన్నారులు పెద్ది శ్రేష్ఠ, పెద్ది సహన,  గుంటూరు  వాస్తవ్యులు నడింపల్లి ఆద్యా లు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ఎ.వి.కె. సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తదుపరి వాగ్గేవి గాన బృందం నిర్వహకురాలు బి. శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపజేసింది. వయెలిన్‌పై చావలి శ్రీనివాస్, మృదంగంపై కె.వి.కిషోర్ వాయిద్య సహకారం అందించారు.