సిరుల కల్పవల్లీ వందనం శరన్నవరాత్రుల్లో భాగంగా శుక్రవారం నగరంలోని పలు దేవాలయాల్లో మహాలక్ష్మిగా జగన్మాతను అలంకరించారు. చిరునవ్వుల సుందర రూపంతో అలరారుతూ అమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం కూడా కలిసి రావడంతో లక్ష్మీదేవికి పూజలు మరింతగా జరిగాయి.
అలరించిన గాత్రకచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, అన్నమయ్య కళావేదికపై ప్రముఖ గాయకురాలు రాగమయూరి నిర్వహించిన గాత్రకచేరి అలరించింది. నాగార్జున సంస్కృతిక కేంద్రం, నాగార్జున సంగీత కళాశాల సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ హైకోర్టు న్యాయమూర్తి కేజీ శంకర్ ప్రారంభించారు. రాగమయూరి పలు త్యాగరాజ కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి మృదంగంపై రామకృష్ణ, వయోలిన్‌పై చావలి శ్రీనివాస్ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమాన్ని సాంస్కృతిక కేంద్రం కార్యదర్శి కే.సూర్యనారాయణ పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి