తీర్థ మహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై మహాభారతం అరణ్యపర్యంలోని తీర్థమహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రసంగిస్తూ అరణ్యపర్వంలో ధర్మరాజు నారదమహర్షిని తీర్థమహత్యాలను తెలువమని అడగ్గా, పూర్వ పులస్త్యుడు భీష్ముడికి చెప్పిన తీర్థరాజ మహాత్యాలను వివరించారని అన్నారు. మహాభారతంలో తీర్థ మహత్యమనేది తీర్థయాత్రల ప్రాముఖ్యత, మహిమను వివరిస్తుందని పేర్కొన్నారు. ఇది ఒక ఆధ్యాత్మిక ప్రయాణమని, ఇక్కడ పాండవులు తీర్థయాత్రలు చేసి పవిత్ర స్థలాలను సందర్శిస్తారని చెప్పారు. ఈ ప్రయాణంలో వారు నదులు, సరస్సులు, పుణ్యక్షేత్రాలను సందర్శించారని పేర్కొన్నారు. తీర్థయాత్రలు వారి జీవితాలపై, ఆధ్యాత్మిక ఎదుగుదలపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహాయపడతాయని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారని పేర్కొన్నారు. తీర్థ యాత్రలకు వెళ్లేటప్పుడు వాటి ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకోవడం ద్వారా జ్ఞానం, జ్ఞానోదయం లభి స్తుందని చెప్పారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి