గుర్రం జాషువా సాహిత్యం చిరస్మరణీయం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళాస్రవంతి సాహితీ సాంస్కృతిక స్సంస్థ అధ్యక్షులు డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్ ఆధ్వర్యంలో శుక్రవారం S “వికోకిల గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా సాహిత్య సభ నిర్వహించారు.సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తాళ్ళూరి వెంకట రత్నారావు సభా పరిచయం చేసారు. సభాధ్యక్షులుగా డాక్టర్ దేవరపల్లి ప్రభుదాస్, ముఖ్య అతిధిగా శాసనమండలి సభ్యులు డొక్కామాణిక్యవరప్రసాద్, తెలుగుశాఖ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆచార్య ఇరవని మాధవి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సభానంతరం గవర్నర్ అవార్డు గ్రహీత డాక్టర్ పెద్దీటి యాహూను, జాతీయ అవార్డు గ్రహీత, తెనాలి డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, విశ్రాంత ఏం.ఈ.ఓ, వినుకొండ సి.హెచ్.జాన్ సుందరరావులను ముఖ్య అతిధి,అతిధులు, సంస్థ వారు కలిసి ఘనంగా సత్కరించారు. పాల్గొన్న అతిధులను కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ప్రభుదాస్ కార్యవర్గం వారు సత్కరించారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి