వైభవంగా గోదా అమ్మవారికి శ్రీ పుష్పయాగం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారి తిరునక్షత్ర సందర్భంగా సోమవారం అమ్మవారికి శ్రీ పుష్పయాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సూరెడ్డి రాంప్రసాద్, పద్మజ దంపతుల సౌజన్యంతో, పాలకవర్గ సహాయ సహకారాలతో, వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారి మూలవిరాట్ కు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు తో విశేష అభిషేకాలు, అర్చనలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరణ జరిగాయి. మల్లె, జాజి, బంతి, చామంతి, కనకాంబరం, లిల్లీ, గులాబి, సంపంగి, తులసి దళాలు తదితర ఏడు క్వింటాల పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించారు. హరి సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి