అలరించిన నృత్యనీరాజనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై నాట్యాచారిణి కుబేరినీ శిష్యబృందంచే శనివారం జరిగిన నృత్యనీరాజనం కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ శాస్త్రీయ నృత్య కళ పట్ల అంకితభావం, నైపుణ్యంతో ఉత్తర కరోలినీ, అమెరికా వాస్తవ్యులు చిన్నారులు పెద్ది శ్రేష్ఠ, పెద్ది సహన, గుంటూరు వాస్తవ్యులు నడింపల్లి ఆద్యా లు పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ఎ.వి.కె. సుజాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తదుపరి వాగ్గేవి గాన బృందం నిర్వహకురాలు బి. శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించిన భక్తి సంగీత విభావరి ప్రేక్షకులను అలరింపజేసింది. వయెలిన్‌పై చావలి శ్రీనివాస్, మృదంగంపై కె.వి.కిషోర్ వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి