అలరించిన సినీ భక్తి సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికగా ఆదివారం మహతి స్వరసుధ వ్యవస్థాపకురాలు పత్రినిర్మల ఆధ్వర్యంలో రజతోత్సవాలలో ఏడవ భక్తి సినీ సంగీత విభావరి జరిగింది. గౌరవ అతిధులుగా పాల్గొన్న కొల్లూరు వేణుగోపాలరావు, అరుణకుమారి దంపతులు, కొంజేటి శివనాగప్రసాద్, దండా మోహన్‌రావు, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సినీసంగీత విభావరిలో గాయని గాయకులు పత్రినిర్మల, అన్నపూర్ణ, ముకుంద ప్రియ, హారిక గోవిందరాజు, శరణ్యప్రతాప్, రసూల్ బాబు, వలి, డాక్టర్ వీరఆతుకూరి, కృష్ణప్రసాద్ తదితరులు అలనాటి చిత్రాలలోని సినీ భక్తి గీతాలను వీనుల విందుగా గానం చేసి ఆహుతులను అలరించారు. వీరికి కీబోర్డ్ పై కే. రవిబాబు, తబలా పై ఎస్. వెంకట్, పాడ్స్‌పై టీ. ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. ప్రధాన కార్యదర్శి కే. మదన్మోహన్ రావు కార్యక్రమాన్ని నిర్వహించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి