సమాజ మార్గదర్శి భగవద్గీత
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణ వేదికపై గురువారం భగవద్గీత జ్యోతి-మనో మార్గదర్శి జుగల్బందీ వ్యాఖ్యాన పూర్వక ప్రవచనం నిర్వహించారు. ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. కోట రామలక్ష్మి భగవద్గీతలోని శ్లోకాలను పఠించారు. భగవద్గీతలోని అంతరార్ధాలను విపులంగా వివరిం చారు. కాటూరి వైద్య కళాశాల మానసిక వైద్య అధ్యాపక వైద్యులు కోట సురేష్కుమార్ భగవద్గీతలోని పాత్రలు, వారి ప్రవర్తన, సుఖ దుఃఖాల సమాహారాన్ని, మానసిక స్థితులను తెలియజేశారు. భగవద్గీతను అనుసరించి నేటి కాలంలో మానవులు అనుసరించాల్సిన నీతి, నియమాలను తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి