ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

జూన్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన - సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 28.07.2025

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.

మూత్ర సమస్యలపై అవగాహన అవసరం - 27.06.2025

మూత్ర సమస్యలపై అవగాహన అవసరం మూత్ర సంబంధిత సమస్యలపై వయోవృద్ధులు అవగాహన పెంచుకోవాలని ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ ఆరె అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగ ణంలోని అన్నమయ్య కళావేదికపై గుంటూరు జిల్లా సీని యర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మూత్ర సమస్య లపై అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ కార్తీక్ ఆరె, డాక్టర్ చేకూరి సింధుశ్రీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మూత్ర సమస్యలపై అవగాహన కల్పించారు.

శ్రీవారిని దర్శించుకున్న హంపి విరుపాక్ష పీఠాధిపతి - 25.06.2025

శ్రీవారిని దర్శించుకున్న హంపి విరుపాక్ష పీఠాధిపతి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయాన్ని గురువారం హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్యభారతిమహాస్వామి స్వామి దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు, ఆలయ కమిటి సభ్యులను ఆశీర్వదించారు. తొలుత ఆలయ మర్యాదలతో విద్యారణ్యభారతిస్వామికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ, ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టా ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా కళాసేవా పురస్కారం ప్రదానం - 26.06.2025

ఘనంగా కళాసేవా పురస్కారం ప్రదానం స్థానిక బృందావన్గార్డెన్స్, శ్రీఅన్నమయ్య కళావేదికపై గురువారం బీవీ రావు మెమోరియల్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో కళా సేవా పురస్కార సభ ఘనంగా జరి గింది. సభాధ్యక్షుడుగా నటుడు, దర్శకుడు ఏంవీ ఎల్ నరసింహారావు వ్యవహరించగా ప్రముఖ వ్యాఖ్యాత ఏవీకే సుజాత సభా పరిచయం చేశారు. ముఖ్య అతి ధిగా డాక్టర్ ఆరె, అతిధులుగా ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జైభవాని నాట్య మండలి అధ్యక్షుడు ఐతి వాసుదేవశర్మ, బి.శ్రీనివాస్, పురస్కార ప్రదాత వీఎస్ రోహిత్ పాల్గొని నటుడు, గుణ నిర్ణేత పరిషత్ నిర్వాహకులు మానాపురం సత్య నారాయణను కళాసేవా పురస్కారంతో ఘనంగా సత్క రించారు. సభానంతరం నంది అవార్డు గ్రహీత కావూరి సత్యనారాయణ పర్యవేక్షణలో కె.ఆదిత్య రచించి, కేవీ మంగారావు దర్శకత్వం వహించిన మిణుగురు - వెలు గులు నాటిక ఆకట్టుకుంది.

భక్తిశ్రద్ధలతో చండీహోమం - 24.06.2025

భక్తిశ్రద్ధలతో చండీహోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో మాసశివరాత్రి సందర్భంగా మంగళవారం రాత్రి విశ్వ శాంతిని కాంక్షిస్తూ చండీ హోమం నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు చేసి పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వ రరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలలో మొదటిది ఓంకారం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు 24,25.06.2025

మంత్రాలలో మొదటిది ఓంకారం స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ప్రవచన కర్త కేవీ కోటేశ్వరరావుచే జగద్గురు శంకరాచార్య విరచిత గణేశా పంచరత్నంపై ప్రవచనం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.. కేవీ కోటేశ్వరరావు ప్రవచిస్తూ మంత్రాలలో మొదటిది ఓంకారమని, పూజలలో మొదటి వాడు గణపతి అని అన్నారు. ఏ పూజలైనా మొదట గణపతి పూజతో ప్రారంభించాలనేది బ్రహ్మోపదేశ మని, ముందుగా గణపతిని పూజిస్తే మనకేం కావాలో ఆయనే చూసు కుంటాడని అన్నారు. మనిషికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచి మనసును జ్ఞాన పూరితంగా ఉంచేవాడు గణపతి, సకల దేవతాస్వరూపుడు గణపతి అని తెలియజేశారు.

మనదేశంలో మహిళలకు గౌరవ స్థానం - 23.06.2025

మనదేశంలో మహిళలకు గౌరవ స్థానం స్త్రీలను గౌరవించే సమాజం అభివృద్ధి చెందుతుందని, అందుకే తొలినాళ్ల నుంచి మనదేశంలో మహిళలకు గౌరవ స్థానమిచ్చారని నిఘంటు రచయిత పెద్ది సాంబశివరావు పేర్కొన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న విశిష్ట మహిళలను గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి సత్కరించారు. న్యాయవాది, రచయిత్రి నల్లూరి రుక్మిణి, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవిలను శాలువా, జ్ఞాపిక, సన్మాన పత్రాలతో నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో ఎం. వేదవతి, గుళ్లపల్లి స్వాతి, గుళ్లపల్లి రాఘవేంద్రరావు, దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, అర్థలపూడి నేహా తదితరులు పాల్గొన్నారు. యడ వల్లి శ్రీదేవి బృందం బుర్రకథ ఆకట్టుకుంది.

వీనుల విందుగా మహతీ స్వరసుధ భక్తి సినీ సంగీత విభావరి - 22.06.2025

వీనుల విందుగా మహతీ స్వరసుధ భక్తి సినీ సంగీత విభావరి  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై ఆదివారం మహతీ స్వరసుధ వ్యవస్థాపకులు పత్రినిర్మల ఆధ్వర్యంలో సంస్థ రజతోత్సవాలలో ఆరవ కార్యక్రమంలో గాయని గాయకులు  రాజ్యలక్ష్మి, హేమమాలిని , రమణి, ముకుంద ప్రియా, మనస్విని, ప్రద్యుమ్న, హరికృష్ణ, వలి, వీర రాఘవ, కృష్ణ ప్రసాద్ లు అలనాటి ఆణి ముత్యాలను వీనుల విందుగా గానం చేసి అహుతులను అలరించారు.  వీరికి కీబోర్డ్ పై కే. రవిబాబు,  తబలా ఎస్. వెంకట్, పాడ్స్ టీ. ఈశ్వర్, వాయిద్య సహకారాన్ని అందించారు. గౌరవ అతిధులుగా చిలకలూరిపేట  తాటికోల అనిరుద్, శ్రీమతి రమాదేవి, ఛైర్మెన్ శ్రీమతి ఆతుకూరి వెంకటలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్  ఆతుకూరి సుబ్బారావు, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలను ప్రారంభించారు.

యోగాసన ప్రదర్శన, భక్తిగీతాలాపన - 21.06.2025

యోగాసన ప్రదర్శన, భక్తిగీతాలాపన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారము ప్రపంచ యోగా దినోత్సవము, ప్రపంచ సంగీత దినోత్సవము సందర్భంగా యోగాచార్య డాక్టర్ రెడ్డి సాంబశివరావు గారి శిష్యబృందంచే యోగాసన ప్రదర్శనలు, పరమేశ్వరి పాటల పల్లకి వారి ఆధ్వర్యములో శ్రీమతి యన్. పరమేశ్వరి బృందంచే భక్తిగీతాలాపన కార్యక్రమం జరిగింది.

దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది - మేజర్ జర్నల్ మాదినేని రమేష్ బాబు - 20.06.2025

దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిది శత్రుదేశాల నుండి మనదేశాన్ని రక్షించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని మేజర్ జర్నల్ మాదినేని రమేష్ బాబు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో పాకిస్తాన్తో యుద్ధం-సింధూరం పై విశ్లేషణ ప్రసంగం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు గుడిపూడి వెంకటరాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేజర్ జర్నల్ మాదినేని రమేష్బాబు మాట్లాడుతూ యుద్ధం అనేది ఆర్మీకో ఎయిర్ఫోర్స్ కో నేవీ కో చెందినది కాదన్నారు. యుద్ధంలో దేశంలోని పౌరులందరు భాగస్వాములు కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనకు, భవిష్యత్ తరాలకు, ఉన్నది ఒకటే దేశమన్నారు. ఆపరేషన్ సింధూర్లో మన సైన్యం, శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకుల బాగస్వామ్యంతో విజయం సాధించామన్నారు. సభలో నాదెండ్ల మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పంచభూతాలలో విశిష్టమైనది వాయువు - 19.06.2025

పంచభూతాలలో విశిష్టమైనది వాయువు పంచభూతాలలో వాయువు ఎంతో విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వెలువోలు నగరాజ్యలక్ష్మి అన్నారు. స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మహిళా విభాగం వారి కార్యక్రమం గురువారం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు శ్రీ చిటిపోతు మస్తానయ, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి ప్రసంగిస్తూ ప్రాణి మనుగడకు ఊపిరి వాయువన్నారు, మన పూర్వీకులు వాయువును దేవతాశక్తిగా భావించి పూజించారని వేద సూత్రాలతో సోదాహరణంగా వివరించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి గోటేటి లలితాశేఖర్ నేటికథ - ఈనాటి మహిళ అనే అంశంపై ప్రసంగం చేశారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి, విజయలక్ష్మి, డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.