ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఏప్రిల్, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన - సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ - 28.07.2025

మెదడు, నరాల వ్యాధులపై అవగాహన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర్వసామి దేవాలయం అన్నమయ్య కళావే దికపై కిమ్స్ శిఖర హాస్పిటల్స్, గుంటూరు జిల్లా సీనియర్ సిటిజ న్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంయు క్తంగా సోమవారం మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై సదస్సు నిర్వహించారు. ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వైద్యులు వివేక్ లంకా, సూరప్రదీప్‌కుమార్‌రెడ్డి పవర్‌పాయింట్ ప్రజంటేషన్తో మెదడు, నరాలకు సంబంధించి వ్యాధులపై అవగాహన కల్పించారు. నరాల సం బంధింత వ్యాధులు అనేక రకాలని, పుట్టుకతో వచ్చేవి, జన్యుపరమైనవి లేదా జీవిత కాలంలో వచ్చేవి ఉంటాయని అన్నారు. మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవ డం, నివారణ చర్యలు తీసుకుని, సరైన చికిత్స పొందాలన్నారు. సంస్థ అధ్యక్షులు మన్నే సుబ్బారావు, కె. బసవనందికేశ్వరరావు పాల్గొన్నారు.

భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం ప్రవచనములు - 07.04.2025 - 11.04.2025

భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి చిన్మయా మిషన్ సువీరానందస్వామి భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం గురించి ప్రసంగించారు. తొలుత ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కె.పూర్ణచంద్రరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కాటాబత్తుల పూర్ణచంద్రరావు రాధ పాల్గొన్నారు. 

కనుల పండువగా సీతారాముల కల్యాణం - 06.04.2025

కనుల పండువగా సీతారాముల కల్యాణం  స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మాధవాచారి, కృష్ణ, సతీష్ చిన్మయి బృందంచే శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. హారతి, అనంతరం విశేషంగా పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి శ్రీరామ పట్టాభిషేకంపై ప్రవచనం చేశారు. కార్యక్రమాల్ని ఆలయ పాలకమండలి వారు పర్యవేక్షించారు. 

అలరించిన శ్రీరామ గానామృతం - 05.04.2025

అలరించిన శ్రీరామ గానామృతం బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భక్త నారద గాన సభ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జరిగిన శ్రీరామ గానామృతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొలుత విశ్రాంత అదనపు ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, సంగీత విద్వాంసుడు కేవీ బ్రహ్మానందం, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి వెలిగించారు. సంగీత విద్వాంసుడు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య భక్తి గీతాలను ఆలపించారు. వయోలిన్ పాలపర్తి ఆంజనేయశాస్త్రి, మృదంగంపై కాకరపర్తి జగన్మోహిని వాద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం కోదండ రామయ్యను నిర్వాహకులు సత్కరించారు.

అలరించిన భక్తి గీతాలాపన - 04.04.2025

అలరించిన భక్తి గీతాలాపన  నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంక టేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై శుక్రవారం సాయంత్రం మధురవళి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో భక్తి గీతాలాపన నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ప్రముఖ సంగీత విద్వాంసురాలు రాధామైథిలి శిష్య బృందం కృష్ణ చంద్రిక, వరలక్ష్మి, సుజాత, తన్వీశ్రీ తమ గాత్రధారణలో పలు అన్నమయ్య సంకీర్తనలు, భక్తి గీతాలను ఆలపిం చారు. ప్రేక్షకులను అలరించాయి. కీబోర్డుపై జి.సాయి, తబలపై పి.వి.రమణ వాయిద్య సహకా రాన్ని అందించారు. 

విశిష్ట మహిళలకు సత్కారం - 03.04.2025

విశిష్ట మహిళలకు సత్కారం  శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విశిష్ట మహిళలకు సత్కారాలు జరిగాయి. సభకు హిందీ అధ్యాపకురాలు డాక్టర్ కె. మంజుల అధ్యక్షత వహించారు. సభలో ఎం.వీ. సత్యవతి (విద్య, ఆధ్యాత్మిక రంగం), అమ్మన విజయలక్ష్మి (నాటకం), బెండపూడి లక్ష్మీకుమారి (హరికథ)లను గుంటుపల్లి అరుణకుమారి, గుళ్లపల్లి స్వాతి, అర్థలపూడి నేహ, మంత్రవాది విజయలక్ష్మి తదితరులు సత్కరించారు. అనంతరం ఎం.వీ. సత్యవతి ఆధ్యాత్మిక ప్రసంగం, అమ్మన విజయలక్ష్మి పద్యపఠనం నిర్వహించారు. ముందుగా నాట్యాచార్య కాజ వెంకటసు బ్రహ్మణ్యం శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. కార్యక్రమాలను నిఘంటు రచయిత పెద్ది సాంబశివరావు పర్యవేక్షించారు. 

నాగాచారికి కాళహస్తి కళావాహిని పురస్కారం - 02.04.2025

నాగాచారికి కాళహస్తి కళావాహిని పురస్కారం  స్థానిక బృందావన్గార్డెన్స్  శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం ప్రముఖ రంగస్థల నటులు, హార్మోనిస్టు దివంగత పోత కమూరి కాళహస్తీశ్వరరావు వర్ధంతి సభ నిర్వ హించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు సి. హెచ్.మస్తానయ్య జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కాళహస్తి కళావాహిని అధ్య క్షుడు ఎంవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్య దర్శి పోతకమూరి తారకబ్రహ్మాచార్యులు, హిం దూ కళాశాల తెలుగు విభాగాధిపతి ఆచా ర్యులు ఎల్లాప్రగడ మల్లికార్జునరావు ప్రసంగించారు. యెల్లంపల్లి యరజర్ల నాగాచారికి కాళహస్తి కళావాహిని పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం నవక్రాంతి కల్చరల్ అసోసియేషన్(హైదరాబాద్) ఆధ్వర్యంలో ఎం .అర్జునరావు దర్శకత్వంలో నర్తనశాల పౌరా ణిక నాటకం ప్రదర్శించారు. కీచకుడిగా ఎం.ఆర్జునరావు, విరాటరాజుగా బి.శ్రీనివాసులు, కంకుభట్టు ఎస్. గాబ్రియేలు, వలలుడు ఎం .శ్రీనివాస్, బృహన్నల జి.మధుసూధనరావు, తంత్రిపాలుడు ఎస్. బ్రహ్మాజీరావు, సుధే ష్టదేవి సురభి విజయలక్ష్మి తదితరులు తమ నటన చాతుర్యంతో నాటకాన్ని రక్తి కట్టించారు. పి.వినాయకరాజ్ బృందం సంగీతాన్ని సమ కూర్చగ...

ఆదర్శ మహిళ అహల్యాబాయి - 01.04.2025

ఆదర్శ మహిళ అహల్యాబాయి పోరాటయోధురాలు  అహల్యాబాయి జీవితాన్ని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సాహిత్య సభ మంగళవారం రాత్రి నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య , ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ రాధాబాయి మాట్లాడుతూ. దేశం , సమాజ చైతన్యం కోసం నిస్వార్ధ పోరాటం చేసిన అహల్యాబాయి త్రిశతాబ్ది ఉత్సవాలను నిర్వహించడం ఆనందదాయకమన్నారు. అనంతరం డాక్టర్ వెలువోలు డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి వాల్మీకి రామాయణం సుందరకాండలోని త్రిజట స్వప్నం విశిష్టతను వివరించారు. ఈసందర్భంగా ఇటీవల కళారత్న పురస్కారం స్వీకరించిన దేవాలయ పాలకవర్గం అధ్యక్షుడు సీహెచ్ . మస్తానయ్యను నిర్వాహకులు సత్కరించారు. కార్యక్రమంలో కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి , సభ్యులు డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి , చందు హనుమా...

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం - 31.03.2025

కళా దర్బార్ ఉగాది పురస్కారాల ప్రదానం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళాదర్బార్-ఆంధ్రప్రదేశ్ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానం సోమవారం రాత్రి జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ పాలకమండలి కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరు నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాధ అయ్యంగారి(టీవీ రంగం), డాక్టర్ జి. నాగార్జున (వైద్యం), కనుమూర్ రాజ్యలక్ష్మి (విద్య), శనివారపు శిరీష (సంగీతం), చెన్నుపాటి శివనాగేశ్వర రావు(వ్యాపారం), సాయి లక్కరాజు(కళారంగం)లకు ఉగాది పురస్కారాలు అందించి సత్కరించారు. అనంతరం సినీ సంగీత విభావరి నిర్వహించారు. హేమమాలిని, సౌజన్య, బాబూరావు, సుధీర్ బాబు, అబ్దుల్ ఖాదర్ సినీ గీతాలను ఆలపించారు.

విశ్వావసుకు వినమ్ర స్వాగతం - 30.03.2025

విశ్వావసుకు వినమ్ర స్వాగతం విశ్వావసు సంవ త్సరంలో శుభాలు కలగా లని శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీరత్న దంపతులు దర్శించుకున్నారు. నాగార్జున సంగీత, నృత్య కళాశాల, నాగార్జున సాంస్కృతికం కేంద్రం నిర్వహణలో ఉగాది వేడుకలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.