విశిష్ట మహిళలకు సత్కారం
శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై గుళ్లపల్లి సుబ్బారావు సేవాసంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి విశిష్ట మహిళలకు సత్కారాలు జరిగాయి. సభకు హిందీ అధ్యాపకురాలు డాక్టర్ కె. మంజుల అధ్యక్షత వహించారు. సభలో ఎం.వీ. సత్యవతి (విద్య, ఆధ్యాత్మిక రంగం), అమ్మన విజయలక్ష్మి (నాటకం), బెండపూడి లక్ష్మీకుమారి (హరికథ)లను గుంటుపల్లి అరుణకుమారి, గుళ్లపల్లి స్వాతి, అర్థలపూడి నేహ, మంత్రవాది విజయలక్ష్మి తదితరులు సత్కరించారు. అనంతరం ఎం.వీ. సత్యవతి ఆధ్యాత్మిక ప్రసంగం, అమ్మన విజయలక్ష్మి పద్యపఠనం నిర్వహించారు. ముందుగా నాట్యాచార్య కాజ వెంకటసు బ్రహ్మణ్యం శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. కార్యక్రమాలను నిఘంటు రచయిత పెద్ది సాంబశివరావు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి