భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం రాత్రి చిన్మయా మిషన్ సువీరానందస్వామి భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగయోగం గురించి ప్రసంగించారు. తొలుత ఆలయ పాలకమండలి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, కె.పూర్ణచంద్రరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. కాటాబత్తుల పూర్ణచంద్రరావు రాధ పాల్గొన్నారు.
విశ్వావసుకు వినమ్ర స్వాగతం
విశ్వావసు సంవ త్సరంలో శుభాలు కలగా లని శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. బృందావన్ గార్డెన్స్లోని శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయానికి భక్తులు ఆదివారం ఉదయం నుంచే అధిక సంఖ్యలో తరలి వచ్చారు. శ్రీవారిని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీరత్న దంపతులు దర్శించుకున్నారు. నాగార్జున సంగీత, నృత్య కళాశాల, నాగార్జున సాంస్కృతికం కేంద్రం నిర్వహణలో ఉగాది వేడుకలు జరిగాయి. సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి