ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

మార్చి, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది

పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారం - 16.04.2025

పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారం  స్థానిక బృందావన్ గార్డెన్స్  శ్రీవేంకటేశ్వర్వస్వామి దేవాలయ ప్రాంగణం అన్న మయ్య కళావేదికపై బుధవారం సాయంత్రం తెలుగు నాటక రంగ దినోత్సవం, మల్లాది చంద్ర శేఖరశాస్త్రి శత జయంతి నిర్వహించారు. భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్(హైదరాబాద్), శ్రీరామకృష్ణా నాట్య మండలి సంయుక్తంగా నిర్వ హించగా, డాక్టర్ పిల్లుట్ల లక్ష్మీకాంతశర్మ అధ్యక్షత వహించారు. అనంతరం ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణకు మల్లాది చంద్రశేఖరశాస్త్రి స్మారక పురస్కారంతో సత్కరిం చారు. కార్యక్రమంలో సినీ నటులు మల్లాది రాఘవ రావు, ఆలయ కమిటీ అధ్యక్షులు సీహెచ్ మస్తా నయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, డాక్టర్ చింతలపాటి శూలపాణి, ఎం.సూర్యనారాయణ పాల్గొన్నారు. సభానంతరం ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక పద్య నాటకం ప్రేక్షకులను అలరించింది.

స్వచ్ఛంద సేవలు అభినందనీయం - 29.03.2025

స్వచ్ఛంద సేవలు అభినందనీయం  భారతీయత-స్వచ్ఛంద సేవాత్సరాల సేవా ప్రస్థానం సంస్థ 25 సంవ ఆదర్శనీయమని ఇస్కాన్ టెంపుల్స్ అంతర్జాతీయ ప్రచారకుడు రామ్ మురారిదాస్ అన్నారు. శనివారం రాత్రి స్థానిక బృందావన గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద భారతీయ స్వచ్చంద సేవా సంస్థ రజతోత్సవం, అమరావతి సాంసృతిక చైతన్య వేదిక ఉగాది సాంస్కృతిక వేడుకలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యర్రంశెట్టి శివసూర్యనారాయణ, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పీవీ మల్లికార్జునరావు, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ తదితరులు ప్రసంగించారు. గత 25 సంవత్సరాలుగా చలివేంద్రాలు, యోగా తరగతులు, రైతు ప్రాధాన్య సదస్సులు, న్యాయ సంబంధ చట్టాలపై అవగా హన కార్యక్రమాలు, పేదలకు నిత్యా వసరాలు వైద్య సేవలు అందించినట్లు సంస్థ ప్రతినిధి చిగురుపాటి రవీంద్రబాబు చెప్పారు. గాయకులు లెనీన, పాటల వెంకన్న, రంగం రాజేష్, ఎం అరుణ్ కుమార్, పి అశోక్, బిల్లా నాగరాజులకు నిర్వా హకులు, అతిధులు ఉగాది కళాపురస్కారాలిచ్చి సత్కరించారు. కార్యక్ర మంలో డాక్టర్ విజయలక్ష్మి, పీ...

ఉగాది పురస్కారాలు ప్రదానం - 28.03.2025

ఉగాది పురస్కారాలు ప్రదానం - యువకళావాహిని, హైదరాబాద్ బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై కళావిపంచి హైదరాబాద్, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ సంయుక్త నిర్వహణలో శుక్రవారం రాత్రి ఉగాది పురస్కరించుకొని పలురంగాల్లోని ప్రముఖులకు ఉగాది పురస్కారాల ప్రదానం జరిగింది. గుంటూరు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్ బీజీ పార్థసారథి, గుంటూరు జిల్లా జడ్జి ఆర్. శరత్‌బాబు, లంకా లక్ష్మీనారాయణ, ఆజోవిభో పౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు ప్రసంగించారు. వెలువోలు నాగరాజ్యలక్ష్మి, వట్టి జొన్నల బ్రహ్మం, మేకల మోహనరావు, డాక్టర్ బండ్ల రామచంద్, బొర్రా నరసయ్య, వడ్డ మాను రంగమణి, రామరాజు ప్రేమక్కుమార్, బండారు నాగమణి, చెరుకూరి సాంబశివరావులకు ఉగాది పురస్కారాలిచ్చి సత్కరించారు.

నాటక రంగం విశిష్టమైంది - 27.03.2025

నాటక రంగం విశిష్టమైంది  తెలుగు నాటక రంగం మరింత అభివృద్ధి చెందాలని మిర్చియార్డు పూర్వ అధ్యక్షుడు మన్నవ సుబ్బారావు అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం లోని అన్నమయ్య కళావేదికపై కళావిపంచి హైదరాబాద్, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ గుంటూరు, నటరత్న ఎన్టీఆర్ కళాపరిషత్ సంయుక్త నిర్వహణలో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా పురస్కార ప్రదాన సభ గురువారం జరిగింది. రచయత, సినీ నటుడు యు.సుబ్బరాయశర్మ, డాక్టర్ ఎస్. రామచంద్రరావు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య. రంగస్థల ప్రముఖుడు నూతలపాటి సాంబయ్య, ఆలయ పాలక మండలి ఉపకార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు నాటక రంగం విశిష్టత గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గురజాడ పురస్కారాన్ని పిన్నమనేని మృత్యుంజయరావు, బళ్లారి రాఘవ పురస్కారాన్ని బసవరాజు జయశంకర్, సీఎ స్సార్ పురస్కారాన్ని వైవీఆర్ ఆచార్యులు, గరికపాటి రాజారావు పురస్కారాన్ని సుంకర కోటేశ్వరరావు, గోవిందరావు పురస్కారాన్ని సురభి సంతోషు, రఘురామయ్య పురస్కారం తిరుమలాబీ, వైకే నాగేశ్వరరావు పురస్కారాన్ని డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, జామున రాయలు పురస్కారం జ్యోతి, జంధ్యాల పురస్కారాన్ని మల్లాది భాస్కర్...

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం - 26.03.2025

స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం స్వచ్చంద సంస్థల సేవాభావం అభినందనీయమని ఎమ్మెల్సీగా ఎన్నికైన అలపాటి రాజేంద్రప్రసాద్ కొనియాడారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై సీనియర్ సిటి జన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ పదో ఆవిర్భావ దినోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అలపాటి మాట్లాడుతూ సంస్థ సేవలను మరింతగా విస్తృతపర్చాలన్నారు. ప్రముఖులు కొత్త సుబ్రహ్మణ్యం, పెద్ది శివరామప్రసాద్, డాక్టర్ యడ్లపల్లి సుబ్రహ్మణ్యం, దాసరి హనుమంతరావు, నూతలపాటి తిరుపతయ్య తదితరులు సంస్థ సేవలను ప్రశంసించారు. తొలుత సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను అధ్యక్షుడు డాక్టర్ మన్నె సుబ్బారావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సభ్యులు మన్నవ వాత్సల్య, గడిపూడి కీర్తి సమకూర్చిన ఉపకార వేతనాలను ఆలపాటి చేతులమీదుగా విద్యార్థినులకు అందించారు. 

సంకల్పంతోనే విజయం - శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి - 25.03.2025

సంకల్పంతోనే విజయం సంకల్పం గట్టిగా ఉంటే.. విజయం తథ్యమని మహాభారతంలో పాశుపతాస్త్ర సాధన సమయంలో అర్జునుడు నిరూపించాడని సంస్కృతాంధ్ర పండితుడు గుదిమెళ్ల శ్రీకూర్మనాధస్వామి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై మంగళవారం రాత్రి ఆయన మహాభారతంలోని అరణ్యపర్వంపై విశ్లేషణాత్మక ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. తొలుత ఆలయ ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుదిమెళ్ల శ్రీకూర్మనాథ స్వామి ప్రవచనం చేస్తూ అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పొందిన విధానం, తర్వాత ఇంద్రుడిని కలిసినప్పటి విశేషాలను వివరించారు.

అలరించిన సంగీత విభావరి - 23.03.2025

అలరించిన సంగీత విభావరి  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం సాయంత్రం మహాతి స్వరసుధ ఆధ్వర్యంలో రజతోత్సవల సందర్భంగా ఆదివారం జరిగిన సినీసంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత టీ.జె.పీ.ఎస్. కాలేజీ కార్యదర్శి, కరెస్పాండంట్ కే.వీ.బ్రహ్మం, ఆలయ కమిటి సభ్యులు కన్నెగంటి బుచ్చయ్య చౌదరి, బండ్లమూడి విజయలక్ష్మి, నల్లూరి బాబ్జి, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు తదితరులు పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి, కళాకారులను అభినందించి సత్కరించారు. గాయని గాయకులు పత్రినిర్మల, సీహెచ్. సుధాశ్రీనివాస్,  సిహెచ్. రాజ్యలక్ష్మి, ఎం.డి. జరీనా, కె.ప్రద్యుమ్నసత్మోద్భవి, జి. హరికృష్ణ, యస్. కమల్ కిషోర్, బి. వీరయ్య, డాక్టర్. ఎ.వీరరాఘవ, బి. కృష్ణప్రసాద్ లు తమ గాన మాధుర్యంతో అలనాటి మేటి చిత్రాలలోని పలు భక్తి, సినీ గీతాలను ఆలపించారు. కీబోర్డ్ పై  కే. రవిబాబు, తబలా పై ఎస్. వెంకట్, పాడ్స్ పై టీ. ఈశ్వర్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.  కార్యక్రమాలను కే. మదన్మోహన్ రావు పర్యవేక్షించారు.

అలరించిన భక్తిగీతాలపన - 22.03.2025

అలరించిన భక్తిగీతాలపన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం జరిగిన భక్తిగీతాలపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీ యిమ్మడి అంజనీదేవి బృందం తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను అలరింపజేశారు. వీరికి తబలపై బాలాజీ, కీబోర్డుపై అశోక్ కుమార్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.

ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి - 21.03.2025

ఆదర్శ కవి.. తుమ్మల సీతారామమూర్తి  సామాజిక చైతన్యంతో విప్లవాత్మక కవిత్వం రాసి తెలుగు జాతికి మార్గదర్శకత్వం వహించిన గొప్ప కవి తెనుగు లెంక తుమ్మల సీతారామమూర్తి అని పలువురు కీర్తించారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్న మయ్య కళావేదికపై తుమ్మల కళాపీఠం ఆధ్వ ర్యంలో తుమ్మల వర్ధంతి సందర్భంగా పోతన భాగవత సమారాధన, ఏటుకూరి సాహిత్య సమాలో చన, కార్యక్రమాలు జరిగాయి. తుమ్మల కళాపీఠం అధ్యక్షుడు డాక్టర్ కొండబోలు కృష్ణప్రసాద్ సభకు అధ్యక్షత వహించి కళాపీఠం నిర్వహిస్తున్న కార్యక్ర మాలను వివరించారు. పోతన సాహిత్య సమారా ధన ఆంశంలో టీజేపీఎస్ కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ గోనుగుంట్ల వైదేహి పోతన భాగవతంలోని గజేంద్రమోక్షంలో తాత్విక, ఆధ్యాత్మిక విశేషాలు వివరించారు. సాహితీవేత్త డాక్టర్ బీరం సుందర్రావు మాట్లాడుతూ ఏటుకూరి సాహిత్యంలోని కవితాత్మక అంశాలు వివరించారు. అనంతరం 'తుమ్మల కవిత్వంలో సామాజిక చైతన్య స్ఫూర్తి' అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో డాక్టర్ టేకుమళ్ల వెంకటప్పయ్యకు రూ.5 వేలు, డాక్టర్ పాతూరి సుబ్రహ్మణ్య కవికి రూ.3 వేలు, బొడ్డపాటి చంద్రశేఖర్కు రూ.2 వేలు నగదు...

శ్రీమద్భగవద్గీత - క్షేత్రజ్ఞవిభాగయోగః ప్రవచనము - 19.03.2025

శ్రీమద్భగవద్గీత - క్షేత్రజ్ఞవిభాగయోగః ప్రవచనము - 19.03.2025 స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామిదేవాలయం అన్నమయ్య కళావేదికపై జరుబుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో బుధవా రం శ్రీమద్భగవద్గీత త్ర యోదశ అధ్యాయంలోని క్షేత్రజ్ఞ విభాగ యోగం ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జరుబుల బంగారుబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ పరమాత్మ ఆధ్యాత్మిక జ్ఞానము నందు నిత్యస్థితుడై యుండుట, తత్త్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడేనని తెలుసుకొనుట, జ్ఞానప్రాప్తికి సాధనములని వీటికి విపరీతమైనది అజ్ఞానమన్నారు. సదసత్తులకు, ఇంద్రియాలకు అతీతుడన్నారు. ప్రకృతి సంబంధం వలన గుణానుభవములను కలిగి ఉన్నవారు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారని తెలిపారు.

భగవద్గీతపై ఆధ్యాత్మిక ప్రవచనం - సువీరానందస్వామి - 17.03.2025

భగవద్గీతపై ఆధ్యాత్మిక ప్రవచనం - సువీరానందస్వామి, చిన్మయమిషన్ గుంటూరు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై జరుబుల బంగారుబాబు, శివకుమారి దంపతుల సౌజన్యంతో సోమవారం శ్రీమద్భగవద్గీత త్రయోదశ అధ్యాయంలోని క్షేత్రజ్ఞ విభాగయోగం ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ప్రధానకార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, జరుబుల బంగారుబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయమిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ  క్షేత్ర, క్షేత్రజ్ఞుల తత్త్వములను గూర్చి ఋషులెల్లరు పలు విధాలుగా వివరించారని, వివిధ వేదమంత్రాలను వేర్వేరుగా తెల్పారన్నారు. బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకంగా, సహేతుకంగా తేటతెల్లం చేశారని ద్వేషము, సుఖం, దుఖం, స్థూలశరీరం, చైతన్యం, అను వికారాలతో కూడిన క్షేత్రస్వరూపం సంక్షిప్తంగా పరమాత్మే అన్నారు.