భక్తిశ్రద్దలతో చండీహోమం స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం చండీహోమం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే తొమ్మిది మంది వేదపం డితుల నిర్వహణలో గణ పతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న సంప్రదాయ సంగీత కచేరి భావి తరాలకు సంప్రదాయ సంగీతాన్ని అందించటమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభినందనీయమని డాక్టర్ వైవీకే దుర్గాప్రసాదరావు అన్నారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తోన్న వాగ్గేయకార మహోత్సవాలు 27.10.2024 ఆదివారం ముగిశాయి. డాక్టర్ వై.శైలజ , ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్. మస్తానయ్య , సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సన్మండలి అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు డాక్టర్ పి.విజయ , ఎంవై. శేషు రాణి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ దుర్గప్రసాదరావు మాట్లాడుతూ కొన్నాళ్లుగా సన్మండలి నిర్వహిస్తోన్న సేవలు ప్రశంస నీయమని అన్నారు. అనంతరం విదుషి కస్తూరి కమలదీప్తి (విశాఖపట్నం) శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. వయోలిన్పై మందా శ్రీరమ్య(చెన్నై) , మృదంగంపై బుర్రా శ్రీరామ్ (చెన్నై) వాయిద్యాన్ని అందించారు. అనంతరం ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి , ఎం.మీనాక్షి , పి.లలితదేవి , కార్యదర్శి ఎ.మంగాదేవి , కోశాధికారి ఎం. విజ...