శ్రీమద్భగవద్గీత పై చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి వారిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై 14.10.2024 సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవత్ గీతలోని దశమ అధ్యాయంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో నా లీలావతార విశేషాలను దేవతలు గానీ, మహర్షులు గానీ తెలుసుకోలేరన్నారు. ఎందుకంటే అన్ని విధములుగా ఆ దేవతలకు, మహర్షులకు మూల కారణమైన వాడిని నేనేనన్నారు. యథార్థముగా జన్మరహితునిగా, ఆదిరహితుడై అన్నింటికి కారణమైనవానిని, సకల లోక మహేశ్వరునిగా తెలుసుకొన్నవారు మానవులలో జ్ఞాని అని వారు సర్వపాపముల నుండి విముక్తుడగుతారన్నారు. 18.10.2024 వరకు ప్రవచనములు జరుగునని ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి