‘గుంటూరుతిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళావేదికపై 20.10.2024 ఆదివారం రాత్రి డాక్టర్ ఉమ్మనేని రంగారావు ప్రథమ వర్ధంతి సంస్మరణ సభ నిర్వహించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య మాట్లాడుతూ చలపతి ఇంజినీరింగ్ కళాశాలలో సుదీర్ఘ కాలం ప్రిన్సిపల్, డైరెక్టర్ డాక్టర్ రంగారావు చేసిన సేవలు ఆదర్శప్రాయమన్నారు. ఆయన నాటికలు, కళలు, సంస్కృతి, తెలుగుదనం అంటే ఎంతో ఇష్టపడేవారన్నారు. ప్రముఖ రంగస్థల చలన చిత్రనటుడు మల్లాది భాస్కర్ మాట్లాడుతూ రంగారావు జ్ఞాపకంగా ఆయన కుటుంబ సభ్యులు గుంటూరు హ్యూమర్ క్లబ్ ఆధ్వర్యంలో 115వ హాస్య వల్లరి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు గుంటూరు హ్యూమర్ క్లబ్ అధ్యక్షుడు జంపని కిషోర్‌బాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మల్లాది క్రియేషన్స్, హైదరాబాద్ వారి చీకట్లో చంద్రుడు నాటిక ప్రదర్శించారు. కార్యక్రమంలో గుంటూరు హ్యూమర్ క్లబ్ కార్యదర్శి అత్తలూరి నాగజ్యోతి, వ్యవస్థాపక కార్యదర్శి లాల్ వజీర్, రంగారావు కుటుంబ సభ్యులు ఉమ్మనేని శివనాగేశ్వరరావు, ఉమ్మనేని వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి