భక్తిశ్రద్ధలతో చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతుల ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. 9మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీమద్భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనాలు
‘గుంటూరు తిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ
ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవత్
గీతలోని దశమ అధ్యాయంపై బుధవారం చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి
ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్.
మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి
ప్రవచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో సూర్యరూపమును నేను తపించుచున్నానన్నారు.
సముద్రాల నుండి నీటిని గ్రహించి వర్షరూపములో వదులుతున్నాననీ, శాశ్వతమైన ఆత్మను
సమస్త వస్తుజాలమును కూడా నేనే అన్నారు. పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్ను సేవించి,
స్వర్గప్రాప్తిని కోరుతారని, అట్టి పురుషులు తమ పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును
పొందుతారని, దేవతల దివ్యభోగములను అనుభవిస్తారన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి