శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవంపై ప్రవచనం
‘గుంటూరుతిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై 14.10.2024 ఆదివారం సాయంత్రం బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తిచే శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శులు పుట్టగుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నోరి నారాయణమూర్తి ప్రవచిస్తూ ఆశ్వీయుజ మాసం పవిత్రమైనదన్నారు. వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తాయన్నారు. యమధర్మరాజు బాధల నుండి తొలగడానికి, సుఖాల శుభములు కలుగుటకు ఈ శరన్నవరాత్ర మహోత్సవములు చేస్తారన్నారు. దీనిని దేవీ నరవరాత్రులు అంటారు. ఈ సమయంలో కూడా తిరుమలలో బ్రహ్మోత్సవములు జరుగుతాయన్నారు. అమ్మవారి అలంకారాలు, తిరుమలలో శ్రీవారి అలంకారములు చేసి వారిని సందర్శించి భక్తులు తరిస్తారన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని గూర్చి భగవత్ భక్తులకు సవివరంగా తెలియజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి