‘గుంటూరు తిరుమల’ బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీ దేవి శరన్నవరాతులు ముగింపు శనివారం 12.10.2024 విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో అన్నమయ్య కళావేదికపై మహతీస్వరసుధ వారి భక్తి సంగీత విభావరి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పత్రి నిర్మల గారి ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. తొలుత గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి ఆధ్వర్యంలో కళాకారులను ఘనంగా సత్కరించారు. పద్మావతి కళ్యాణవేదికపై సత్సంగ సభ్యులచే లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు.
‘గుంటూరు తిరుమల’ బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై 04.10.2024 శుక్రవారం ఉదయం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అన్నమయ్య కళావేదికపై యం.వై.శేషురాణి, భువనేశ్వరి గార్లచే దేవీ కీర్తనల గానం సుమధురంగా సాగింది. తంగిరాల అన్నపూర్ణ (ఏ.ఐ.ఆర్. ఆర్టిస్ట్) వ్యాఖ్యానం అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి