శ్రీమద్భగవద్గీత పై ఆధ్యాత్మిక ప్రవచనం
‘గుంటూరుతిరుమల’ స్థానిక బృందావన్‌గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో శ్రీమద్భగవద్గీతలోని దశమ అధ్యాయంపై 18.10.2024 శుక్రవారం ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో అర్జునా సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనేననీ, నేను లేని చరాచరప్రాణి యేది లేదన్నారు. నా దివ్య విభూతులనై ఐశ్వర్య, కాంతి, శక్తి యుక్తములైన వస్తువు ఏదైనా నా తేజస్సు యొక్క అంశము నుండే కలిగినదన్నారు. ఈ సంపుర్ణ జగత్తును కేవలం నా యోగశక్తి యొక్క అంశతోనే దర్శించుచున్నానన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి