నేత్రానందం నృత్యాభినయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో శ్రీ.కె. ఆర్.కె.ఎం. మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 10 వ అమరావతి నృత్యోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నృత్యోత్సవాలలో ప్రదర్శించిన కూచిపూడి , ఒడిస్సి , భరతనాట్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. అధితులుగా కళాకారుడు రాయన గిరిధర్ గౌడ్ , ప్రముఖ సాహితీవేత్త , సంగీత విద్వాంసులు డాక్టర్ భూసురపల్లి వెంకటేశ్వర్లు , రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాస్ ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య సంస్థ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులను ఘనంగా సత్కరించారు.ప్రముఖ నాత్యాచార్యులచే ప్రీతి మొహాపత్ర పలు పాటలకు ఒడిస్సి నృత్యం , చల్లా వేదవల్లి ప...
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ ఏడాది తొలి ఏకాదశి శ్రీవారికి ప్రీతిపాత్రమైన శనివారంతో కలిసి రావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీనివాసుడ్ని కనులారా వీక్షించేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు తిరునాళ్లను తలపించాయి. ఆర్చకులు శ్రీవారిని పలురకాల పుష్పాలతో చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల రద్దీని ముందే ఊహించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.
.jpeg)


.jpeg)
.jpeg)

.jpeg)





శ్లో. శ్రీనివాస! నమ స్తుభ్యం
రిప్లయితొలగించండిశ్రియం దేహి దయామయ!
గుణ్టూరునగరస్థ! శ్రీ
బృన్దావనప్రియ! ప్రభో!