వైభవంగా పుష్పయాగం - 06.11.2025
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి