ముగిసిన విరాటపర్వంపై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి
ఆలయ ప్రాంగణంలో అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమహాభారతంలోని విరాటపర్వంపై
ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యుల జ్యోతిప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి
ప్రవచనం చేస్తూ మహాభారతంలోని
విరాటపర్వం పాండవుల ఒక సంవత్సరం అజ్ఞాతవాస గాథను వివరిస్తుందన్నారు. పాండవులు, ద్రౌపదితో సహా
మత్స్యదేశ రాజు విరాటుని కొలువులో వివిధ మారుపేర్లతో తలదాచుకుంటారన్నారు. అజ్ఞాతవాస సమయంలో ద్రౌపదిని
వేధించిన కీచకుడిని భీముడు అంతం చేస్తాడన్నారు. కౌరవులు మత్స్యదేశంపై దండెత్తి
గోవులను అపహరించగా, ఉత్తర గోగ్రహణ యుద్ధంలో అర్జునుడు బృహన్నల వేషంలో ఒంటరిగా కౌరవ
సైన్యాన్ని ఓడిస్తాడన్నారు. అజ్ఞాతవాసం విజయవంతంగా ముగిసిన తరువాత, పాండవులు తమ
నిజరూపాలు బయటపెడతారన్నారు. విరాటరాజు తన కూతురు ఉత్తరను అర్జునుని కుమారుడైన అభిమన్యుడికిచ్చి
వివాహం జరిపిస్తాడన్నారు. కార్యక్రమం అనంతరం దేవాలయ పాలకమండలి వారు గుదిమెళ్ళ
శ్రీకూర్మనాథస్వామి వారిని ఘనంగా సత్కరించారు.
.jpeg)


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి