అలరించిన భక్తి సంగీత విభావరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై మహతీ స్వరసుధ వ్యవస్థాపకులు పత్రినిర్మల ఆధ్వర్యంలో గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ , గుంటూరు వారి సౌజన్యంతో భక్తి సంగీత విభావరి 307 వ కార్యక్రమం జరిగింది, గాయని గాయకులూ ఎస్. కే. రసూల్బాబు , డాక్టర్ రాఘవ, ఆనంద్ చింతల, వలి, కృష్ణప్రసాద్, జరీనా, ప్రసన్న లక్ష్మి, ప్రద్యుమ్న అనేక సినీ భక్తి గీతాలను ఆలపించి అభిమానులను అలరించారు. వీరికి కీబోర్డ్ పై కే. రవి, తబలా పై వెంకట్, పాడ్స్ పై కే. చంద్ర వాయిద్య సహకారాన్ని అందించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి, సంస్థ వారు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఏ.వీ.కే. సుజాత వ్యాఖ్యానంతో మదన్మోహన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ కన్వీనర్ రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో కళాకారులను నిర్వాహకులు మదన్ మోహన్ ను ఘనంగా సత్కరించారు.



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి