అపరాజితా స్తోత్రంపై ప్రవచనము
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శరన్నవరాత్రుల సందర్బంగా సోమవారం సాయంత్రం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అపరాజితా స్తోత్రమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన తో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ వసంత రుతువు, శరత్ రుతువులలో శరీర రుగ్మతల నుండి కాపాడటానికి అనేక నియమాలు మన రుషులు ఏర్పర్చారన్నారు. అదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత అన్నారు. ప్రపంచమే ఆనందమనుకుంటే మానవుడు రాగంలో పడతాడనీ, ప్రపంచంలో శాంతి లేదు కాని భగవంతుని వద్దనే అది లభిస్తుందన్నారు. ద్రౌపది వస్తాభరణం జరిగినప్పుడు తన భర్తలు, సభలోని పెద్దలు ఎటువంటి సహాయం చేయలేని సమయంలో ఆ భగవంతుడే కాపాడారన్నారు. అమ్మవారు అపరాజితగా అవతరించి ఏ కర్మ చేసిన తెలుసుకొని చేసినప్పుడు సంపూర్ణ ఫలితం లభిస్తుందన్నారు. సృష్టికారుడు పరబ్రహ్మ అని, ప్రపంచమంతా వ్యాపించియున్న అమ్మ స్వయం ప్రకాశితమైనదేనన్నారు. నవరాత్రులలో పూజానంతరం తప్పనిసరిగి పారాయణ చేస్తారన్నారు.




.jpeg)
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి