భక్తిశ్రద్ధలతో చండీహోమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రులలో భాగంగా 16,17,18 తేదీలలో నిర్వహించిన వేదసభ, చండీపారాయణ, చండీహోమం ముగింపుగా మహాపూర్ణాహుతి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులచే 11మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకరరావు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి