ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నేత్రానందం నృత్యాభినయం - 23.10.2026

నేత్రానందం నృత్యాభినయం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి సౌజన్యంతో శ్రీ.కె. ఆర్.కె.ఎం. మెమోరియల్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో 10 వ అమరావతి నృత్యోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. నృత్యోత్సవాలలో  ప్రదర్శించిన కూచిపూడి , ఒడిస్సి , భరతనాట్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు   నాట్యాచార్యులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం  అధ్యక్షత వహించారు. అధితులుగా కళాకారుడు  రాయన గిరిధర్ గౌడ్ , ప్రముఖ సాహితీవేత్త , సంగీత విద్వాంసులు డాక్టర్  భూసురపల్లి వెంకటేశ్వర్లు , రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ రామరాజు శ్రీనివాస్ ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య సంస్థ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ  నాట్యాచారిణి కోకా విజయలక్ష్మి తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాకారులను ఘనంగా సత్కరించారు.ప్రముఖ నాత్యాచార్యులచే  ప్రీతి మొహాపత్ర పలు పాటలకు ఒడిస్సి నృత్యం , చల్లా వేదవల్లి ప...

అలరించిన సినీ భక్తిగీతాలు - 18.10.2026

అలరించిన సినీ భక్తిగీతాలు

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై  శరన్నవరాత్రుల సందర్బంగా ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సాయిబాబా టెలిఫిలిమ్స్, కళాసౌధ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సినీ భక్తిగీతాలాపన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయనీ, గాయకులు డి.టి. సాయిబాబా, సుబ్బారావు, చింతా వాసు, కె. అన్నపూర్ణ, చింతా రజిని లు పలు సినీ, భక్తి గీతాలను ట్రాక్ పై ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.













కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు - 08.11.2025

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనల సోదాహరణ పూర్వక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాన విద్యాప్రవీణ విద్వాన్ ఆకొండి శ్రీని వాస రాజారావు, తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలకు సోదాహరణ పూర్వక వివరణతో శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్ బాబుల వాయిద్యాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు మాధవపెద్ది మీనాక్షి, ముఖ్య అతిథి పూర్వ ప్రధానాచార్యులు, హిం దూ కళాశాల గుంటూరు, సాహితీ రత్నాకర డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్, ఆత్మీయ అతిథి డాక్టర్ సి. జ్యోతి కాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ తూము లక్ష్మీనరసింహ దాసు వాగ్గేయకారులలోని అనేక విశేషార్థాలను వివరిస్తూ ఇటువంటి కార్యక్రామాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను సత్కరించారు.