అలరించిన లక్ష్మీశ్రీనివాస్ వీణానాదలహరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శరన్నవరాత్రుల సందర్బంగా శనివారం సాయంత్రం నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రామరాజు ఫౌండేషన్ మరియు రామరాజు ఇన్ఫ్రా డెవలపర్స్, అధినేత రామరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్ష్మి శ్రీనివాస్ నిర్వహించిన వీణ కచేరీ శ్రావ్యంగా సాగింది. వీణ కచేరీ ప్రారంభిస్తూ అమ్మవారి కీర్తనలతోపాటు అనేక కీర్తనలను వీణపై పలికించి అభిమానులను అలరించారు. వీరికి మృదంగంపై ఎస్. హనుమంతరావు, ఘటంపై ఎం . హరిబాబు, కీబోర్డ్ పై కే.రవిబాబు, పాడ్స్ పై టి. ఈశ్వర్, తబలాపై ఎస్. వెంకటేష్, బ్యాంజోస్ మోహన్ చక్కటి వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమానికి బి.మోహన కృష్ణ వ్యాఖ్యానం అందించారు. తొలుత కార్యక్రమాలను ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి. హెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, రామరాజ శ్రీనివాస్ పాల్గొని జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు. సంస్థ వారు కళాకారులను ఘనంగా సత్కరించారు.



.jpeg)



.jpeg)
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి