దేవీవైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం దేవీ వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపన్యాసభారతి యం.వి.సత్యవతి ప్రవచిస్తూ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతీ ఈ ముగ్గురి కలయికే మూలశక్తి అదే మనం దేవీ అని కొలుస్తున్నాం. శరత్ రుతువులో శాస్త్రప్రకారం ప్రజలు అనేక రకాల రుగ్మతలకు గురౌతారని అటువంటి వాటినుంచి ఉపశమనం పొందటానికి అమ్మవారిని ఈ తొమ్మిదిరోజులు వివిధ అలంకారాలలో సేవించి విజయదశమి రోజు పండుగ జరుపుకుంటామని అన్నారు.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి