ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం అపర అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారి జీవిత విశేషాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కళాకారులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్న ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త మల్లాది కైలాసనాధ్ ప్రవచిస్తూ గోదావరి పరీవాహక ప్రాంతంలో ప్రయాణించే బాటసారులు , పేదలు , ఆకలితో అలమటించేవారు ఏ సమయంలో వచ్చినప్పటికీ , కులమత బేధాలు చూపకుండా సొంత బిడ్డల్లా ఆప్యాయంగా కడుపునిండా అన్నం పెట్టేవారన్నారు. గోదావరి వరదలు , తుఫానుల సమయంలో నిరాశ్రయులైన వేలాది మందికి ఆమె నిలయమే ఆశ్రయమైందన్నారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన బ్రిటన్ చక్రవర్తి ఏడో ఎడ్వర్డ్ సహా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆమెను ఎంతో గౌరవించిందన్నారు. 1909 లో కన్నుమూసిన డొక్కా సీతమ్మ , తెలుగు నేలపై అన్నదానానికి మారుపేరుగా , త్యాగశీలానికి ప్రతిరూపంగా చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.
అలరించిన దేవీ కీర్తనల గానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మూడవరోజు దేవీ కీర్తనల గానం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కళాకారులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్న ప్రారంభించారు. యం.వై.శేషురాణి, జె. భువనేశ్వరి శిష్యబృందం దేవీ కీర్తనలను శ్రావ్యంగా గానం చేశారు. వీరికి వయోలిన్ పై చావలి శ్రీనివాస్, మృదంగంపై కామరాజు కిషోర్ లు చక్కటి వాయిద్య సహకారం అందించారు.







కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి