ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు - 27.07.2026

కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం కిమ్స్ శిఖర హాస్పటల్, గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రసంగిస్తూ కిడ్నీలు శరీరంలో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే మధుమేహం , అధిక రక్తపోటు , పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడటం వంటి కారణాల వల్ల ఇవి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కాళ్ల వాపులు , మూత్రంలో మార్పులు, అలసట వంటి ప్రారంభ లక్షణాలను పసిగట్టడం చాలా ముఖ్యమన్నారు. సరిపడా నీరు తాగడం , ఉప్పు తగ్గించడం , క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను వివరిస్తూనే , ఉచిత బి.పి. , షుగర్, క్రియాటినిన్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు   ప్రజలకు ఉన్న అపోహ...

ముక్కోటి.. ఉత్తర ద్వార దర్శనం - పోటెత్తిన భక్తకోటి - 30.12.2025

ముక్కోటి.. ఉత్తర ద్వార దర్శనం - పోటెత్తిన భక్తకోటి

ముక్కోటి ఏకాదశి పర్వదినం మంగళవారం నగరమంతటా వైభవంగా జరిగింది. వైష్ణవాలయాలన్నీ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తజనసందోహంతో కిటికిటలాడాయి. ఆలయాల నిర్వాహకులు సోమవారం రాత్రికే భక్తుల కోసం సౌకర్యాలను సిద్ధం చేసి ఉంచారు. ఆలయాల ఉత్తర ద్వారాల వద్ద ఉత్సవమూర్తులను అందంగా పూలమాలలతో అలంకరించి పీఠంపై స్వామి ఆశీనుడై ఉన్నట్టు ఆకర్షణీ యంగా అలంకరించారు. మరికొన్ని చోట్ల ఆలయ సంప్రదాయ రీతులు అనుసరించి స్వామి, దేవేరుల ఉత్సవమూర్తులను ఉత్తర ద్వారం దగ్గర వేంచేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.