కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య
కళావేదికపై సోమవారం కిమ్స్ శిఖర హాస్పటల్, గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్
సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులపై
అవగాహన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంస్థ
వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు
పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రసంగిస్తూ కిడ్నీలు శరీరంలో రక్తాన్ని వడపోసి
వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడటం వంటి
కారణాల వల్ల ఇవి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కాళ్ల వాపులు, మూత్రంలో
మార్పులు, అలసట వంటి ప్రారంభ లక్షణాలను పసిగట్టడం చాలా ముఖ్యమన్నారు. సరిపడా నీరు
తాగడం, ఉప్పు తగ్గించడం, క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన
అలవాట్లను వివరిస్తూనే, ఉచిత బి.పి., షుగర్, క్రియాటినిన్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం
అనంతరం డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు ప్రజలకు
ఉన్న అపోహలను తొలగించి, క్రమబద్ధమైన పరీక్షల ద్వారా ప్రాణాపాయాన్ని ఎలా నివారించవచ్చో
అప్రమత్తం చేస్తారన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు,
కార్యదర్శి కోగంటి బసవనందికేశ్వరరావు, సభ్యులు పాల్గొన్నారు.

.jpeg)




आरोग्यभाग्यवान् भव!
రిప్లయితొలగించండి