అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
విశ్వశాంతి కాంక్షిస్తూ చండీహోమం
స్థానిక బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో అధిక జ్యేష్ట మాస పౌర్ణమి సందర్భంగా శనివారం రాత్రి విశ్వశాంతిని కాంక్షిస్తూ లోకకల్యాణార్థం చండీహోమం నిర్వ హించారు. పరిషత్ వ్యవస్థాపకులు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ నిర్వహణలో 11 మంది దంపతుల నిర్వహణలో వేదపండితులు గణపతికి, శివలింగా నికి, నవగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. లక్ష్మీగణపతి, చండీ, రుద్ర హోమాలను, పూర్ణాహు తిని చేశారు. భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి