ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు - 27.07.2026

కిడ్నీ వ్యాధులపై అవగాహన సదస్సు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం కిమ్స్ శిఖర హాస్పటల్, గుంటూరు మరియు గుంటూరుజిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రసంగిస్తూ కిడ్నీలు శరీరంలో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే మధుమేహం , అధిక రక్తపోటు , పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడటం వంటి కారణాల వల్ల ఇవి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కాబట్టి కాళ్ల వాపులు , మూత్రంలో మార్పులు, అలసట వంటి ప్రారంభ లక్షణాలను పసిగట్టడం చాలా ముఖ్యమన్నారు. సరిపడా నీరు తాగడం , ఉప్పు తగ్గించడం , క్రమ తప్పకుండా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను వివరిస్తూనే , ఉచిత బి.పి. , షుగర్, క్రియాటినిన్ పరీక్షలు నిర్వహిస్తారన్నారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ ప్రవీణ్ నల్లమోతు   ప్రజలకు ఉన్న అపోహ...

తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం - 28.12.2025

తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం

స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై పై ఆదివారం ఆధ్యాత్మిక ప్రవచనము జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావైలోని 13వ పాశురాన్ని ప్రవచనం చేస్తూ కొందరు గోపికలు రాముల వారిని కీర్తిస్తే మరికొందరు గోపికలు శ్రీకృష్ణుని గానం చేస్తారన్నారు. వారిలో ఒక పెద్ద ఈ ఇద్దరు ఒక్కరే అని, విభేదాలు వర్ణని సహేతుకంగా చెప్తుందన్నారు. ఈ పాశురంలో ప్రధానంగా పెరియాళ్వారు. వారిని స్మరించాలి. భక్తులకు తెలియజేశారు. పాడుతా తీయగా విజేత కాండూరి లక్ష్మీశ్రీవల్లి తమ గాత్రధారణలో పలు అన్నమాచార్య కీర్తనలు, భక్తి గీతాలను మనోహరంగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకుంది. కీబోర్డుపై కే రవిబాబు, తబలాపై బాలాజీ వాయిద్య సహకారం అందజేశారు. తొలుత జ్యోతి వెలిగించి కార్యక్రమాలను దేవస్థానం అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య ప్రారంభించారు.










కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.