అలరించిన తాళం భజన
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం తాళం భజన నిర్వహించారు. తొలుత పాలకమండలి నిర్వాహకులు జ్యోతిప్రజ్వలన చేశారు. తొలుత సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావైలోని 12వ పాశురంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. శ్రీ విశ్వంభర భక్త భజన సమాజం(పెదనందిపాడు) నిర్వర్తించిన తాళం భజన అలరించింది. అనంతరం కె.చిట్టెమ్మ, ఆర్.రమాదేవి, ఆర్. సుజాత, ఎస్.శ్రీదేవి, ఎం.ఉమ, ఎం.రా జ్యలక్ష్మి తదితరులు అన్నమయ్య, రామదాసు, శ్రీకృష్ణుని కీర్తనలను తాళం భజన రూపంలో ఆలపించారు. వీరికి డోలక్పై వై.శివశంకర్ వాయిద్యాన్ని అందించారు.
.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి