డాక్టర్ రామరాజు సేవలు అభినందనీయం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ఆవరణలోని అన్నమయ్య కళావేదికపై ఆదివారం సినీ నాటక కళాకారులు, రచయత మీసాల లక్ష్మణ్ మన తెలుగు పద్యాలు, డాక్టర్ రామరాజు శ్రీని వాసరావు షష్టిపూర్తి సన్మాన సభ నిర్వహించారు. యువ కళావాహిని, కళావిపంచి, ఆరా ధన ఆర్ట్స్ అకాడమీ, జీవీఆర్ కల్చరల్ ఫౌండేషన్, నటరత్న ఎన్.టి.ఆర్. కళాపరిషత్ సం యుక్త ఆధ్వర్యంలో చేపట్టగా, సభకు ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్. మస్తానయ్య అధ్యక్షత వహించారు. ఏపీ రేరా సభ్యులు దామచర్ల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లా డుతూ డాక్టర్ రామరాజు లక్ష్మీశ్రీనివాస్ సమాజానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు దంపతులను సత్కరించారు. అనంతరం రచయిత లక్ష్మణ్ తెలుగు పద్యాలను వివరించారు. కార్యక్రమంలో యువ కళావాహిని అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ, జి.మల్లికా ర్జునరావు, డి.తిరుమలేశ్వరరావు, నడింపల్లి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వీవీ రాఘవరెడ్డి పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి