అలరించిన భక్త రామదాసు సంగీత సాహిత్య రూపకం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై శనివారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు గద్దె రామతులశమ్మ, జనచైతన్య హౌసింగ్ లిమిటెడ్ అధినేత మాదల రత్నగిరి బాబు సౌజన్యంతో ఏపీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రదర్శించిన భక్త రామదాసు సంగీత సాహిత్య రూపకం పలువురిని విశేషంగా అలరించింది. తొలుత తిరుప్పావై 4వ పాశురంపై డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచనం చేశారు. అనంతరం విజయవాడ వీరమాచనేని పెద్దయ్య, నారాయణ, లిటిల్ బ్రెయిన్ పాఠశాలల విద్యార్థులు తమ పాత్రల ద్వారా భక్త రామదాసు సంగీత రూపకాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మాదల రత్నగిరిబాబు, విజయసారథి, డాక్టర్ తూనుగుంట్ల రాధాబాయి, మైలవరపు లలితకుమారి, విజయలక్ష్మి, పాలకమండలి అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి