తిరుప్పావై పై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా గురువారం తిరుప్పావై ఆధ్యాత్మిక ప్రవచనము జరిగింది. తొలుత ఆలయ ఆలయ కమిటీ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావై లోని 3వ పాశురాన్ని ప్రవచనం చేస్తూ గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేద్దాం రమ్మని గోపీకలను పిలుస్తూ బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తు కెదిగి మూడు లోకాలను కొలిచాడన్నారు. ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే దుర్భిక్షమసలు కలుగనే కలుగదన్నారు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయని పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయన్నారు. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుందన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి