తిరుప్పావైపై ఆధ్యాత్మిక ప్రవచనం ప్రారంభం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం, అన్నమయ్య కళావేదికపై తితిదే ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ధనుర్మాసం సందర్భంగా మంగళవారం తిరుప్పావై ఆధ్యాత్మిక ప్రవచనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం గోదా అమ్మవారి మూలవిరాట్ కు వివిధ ఫలరసాలు, పంచామృతాలతో అభిషేకం, ప్రత్యేక పూజలు, అలంకరణ జరిగాయి. సాయంత్రం ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి తిరుప్పావై ప్రవచనం చేస్తూ కార్తీకమాసం లాంటిదే ధనుర్మాసమన్నారు. ఈ మాసం శ్రీకృష్ణపరమాత్మకు అత్యంత ప్రీతికరమైందని ఈనెల రోజులు పండుగ రోజులుగా జరుపుతారన్నారు.
.jpeg)




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి