ఘనంగా కళా విపంచి వార్షికోత్సవ వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళా విపంచి 20వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు బొప్పన నరసింహారావు (బుజ్జి) అధ్యక్షత వహించారు. అతిథులుగా వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది వట్టిజోన్నల బ్రహ్మారెడ్డి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, యువకళావాహిన అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ఏ.పి. ఫిల్మం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా నియమితులై సందర్భంగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావును, రంగస్థల టీవీ నటుడు దర్శకుడు డాక్టర్ గోవాడ వెంకట్ దంపతులు, డాక్టర్ ఆవుల శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్స్ కార్యనిర్వాహక సభ్యులు వేమూరి బాలరత్నం లను కళా విపంచి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సంస్థ నిర్వాహకులు బొప్పన నరసింహారావును ఆలయ కమిటి వారు, కళాకారులు, అభిమానులు ఘనంగా సత్కరించారు. సభానంతరం గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు జ్యోతిరాధిత్య భీశెట్టి రచనకు డాక్టర్ గోవాడ వెంకట్ దర్శకత్వం వహించిన అమ్మ చెక్కిన బొమ్మ నాటికలు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని భాగి శివశంకరశాస్త్రి, డి. తిరుమలేశ్వరరావు, జి. మల్లికార్జునరావు, సయ్యద్ జానీభాష, జి.వి.జి. శంకర్ తదితరులు పర్యవేక్షించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి