ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఘనంగా కళా విపంచి వార్షికోత్సవ వేడుకలు - 22.07.2026

ఘనంగా కళా విపంచి వార్షికోత్సవ వేడుకలు స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కళా విపంచి 20వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ అధ్యక్షులు బొప్పన నరసింహారావు (బుజ్జి) అధ్యక్షత వహించారు. అతిథులుగా వేదిక అధ్యక్షులు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రామరాజు శ్రీనివాసరావు, ప్రముఖ న్యాయవాది వట్టిజోన్నల బ్రహ్మారెడ్డి, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, యువకళావాహిన అధ్యక్షులు లంక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ఏ.పి. ఫిల్మం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ గా నియమితులై సందర్భంగా డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావును, రంగస్థల టీవీ నటుడు దర్శకుడు డాక్టర్ గోవాడ వెంకట్ దంపతులు , డాక్టర్ ఆవుల శ్రీనివాస్ , ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్స్ కార్యనిర్వాహక సభ్యులు వేమూరి బాలరత్నం లను కళా విపంచి పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సంస్థ నిర్వాహకులు బొప్పన నరసింహారావును ఆలయ కమిటి వారు, కళాకారులు, అభిమానులు ఘనంగా సత్కరించారు. సభానంతరం గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు జ్యోతిరాధిత్య భీశెట్టి రచనకు డ...

పిరదౌసి కావ్యం అజరామరం - 15.12.2025

పిరదౌసి కావ్యం అజరామరం

సాధారణంగా కావ్య పరిచయం మాటల రూపంలో ఉంటుంది. అయితే జాషువా రచించిన పిరదౌసి కావ్యంలోని పద్యాలను పలువురు మధుర కంఠస్వ రంతో పద్యగానం చేశారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై నిర్వహించిన ఈ వినూత్న కార్యక్రమం సోమవారం సాహితీప్రియులను పరవశులను చేసింది. మెట్టు శేషమ్మ, మెట్టు చిన్న మల్లారెడ్డి బీఈడీ కళాశాల, విశ్వనాథ సాహిత్య అకాడమీ, ఈశ్వర వరప్రసాద పరిషత్తు సంయుక్త ఆధ్వర్యంలో పిరదౌసి కావ్యగానం జరిగింది. తొలుత కార్యక్రమాన్ని జనవిజ్ఞాన వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, ప్రముఖ రంగస్థల రచయిత, దర్శకుడు పాటిబండ్ల ఆనందరావు ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు తదితరులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఆధునిక మహా కావ్యాల్లో మహాకవి జాషువా రచించిన పిరదౌసి కావ్యం అజరామరమైందన్నారు. సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ పిరదౌసి కావ్య నేపథ్యాన్ని, జాషువా జీవిత విశేషాలు, ఆయన సాహిత్య రంగా నికి చేసిన కృషిని వివరించారు. వి.ప్రేమ్కుమార్, ఎం.బ్రహ్మయ్య, పీవీ రమణ, జె.బాబూరావు, లెనినా, కిన్నెర్.. పిరదౌసి కావ్యంలోని పద్యాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం కళాకారులను నిర్వాహకులు సత్కరించారు.







కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

ఘనంగా గురువులకు సత్కారం - 10.11.2025

ఘనంగా గురువులకు సత్కారం గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర దేవాలయం అన్నమయ్య కళావేదికపై సోమవారం   గురువులకు   చిరు సత్కార కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభా కార్యక్రమంలో విశ్వపావని సభాధ్యక్షులుగా వ్యవహించారు. అతిథులుగా డాక్టర్ కోగంటి వేంకటశ్రీరంగనాయకి,   బెండపూడి లక్ష్మీకుమారి, డాక్టర్ గిరిజాశేషమాంబ, పాటిబండ్ల జానకి, పసుమర్తి పద్మజకుమారి పాల్గొన్నారు. యిమ్మడి అంజనీదేవి బృందం గురు వందనంలో భాగంగా భక్తిమాల కీర్తనలు పుస్తకరూపం అలాగే సీ.డి. రూపంలో తమను ప్రోత్సహించిన అతిథులను ఘనంగా సన్మానించారు. అతిథులు యిమ్మడి అంజనీదేవి బృందం సంగీతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమాలను యిమ్మడి మల్లికార్జునరావు పర్యవేక్షించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.