ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

భక్తిశ్రద్ధలతో మహా చండీయాగ పూర్ణాహుతి - 12.01.2026

భక్తిశ్రద్ధలతో మహా చండీయాగ పూర్ణాహుతి స్థానిక బృందా వన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్, వేంకటేశ్వరస్వామి దేవాలయ పాలక మండలి సంయుక్త ఆధ్వర్యంలో విశ్వశాంతి, రాజధాని అమరావతి అభివృద్ధి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ గత 14 రోజులుగా నిర్వహిస్తున్న చండీహోమం సోమవారం మహా పూర్ణాహుతి జరిపారు. భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్వవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో లక్ష్మి మహాగణపతికి, నవగ్రహాలకు, రుద్రుడికి అభి షేకాలు, అర్చనలు చేశారు. కలశపూజ, లక్ష్మీగణపతి, రుద్ర, చండీహోమం, 108 రకాల హోమద్రవ్యాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తా నయ్య, ఉపాధ్యక్షుడు లంకా విజయబాబు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు పుట్ట గుంట ప్రభాకరరావు, ఊటుకూరి నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా మహతీస్వర సుధ రజతోత్సవాలు - 11.01.2026

ఘనంగా మహతీస్వర సుధ రజతోత్సవాలు

స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కల్యాణ వేదికపై ఆదివారం మహతీస్వర సుధ సంస్థ రజతోత్సవాల ముగింపు కార్యక్రమాలు జరిగాయి. గాయనీ గాయకులు పత్రి నిర్మల, సురభి శ్రావణి, రాజ్యలక్ష్మి, సాహిత్య, జరీనా, హేమమాలిని, ప్రద్యుమ్న, హరికృష్ణ, రసూల్బాబు, కమల్ కిషోర్, వీరయ్య, డాక్టర్ వీర రాఘవ, డాక్టర్ మురళీబాబూరావు, షేక్ వలి, కృష్ణప్రసాద్లు పాత తెలుగు చల నచిత్రా గీతాలను ఆలపించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ దాతలు, కళాకారులు, ఆలయ పాలక మండలి సహాయ, సహకారాలతో 300 కార్యక్ర మాలు సంస్థ నిర్వహించినట్లు చెప్పారు. గాయకులను సత్కరించారు. మహతీ స్వరసుధ వ్యవస్థాపకులు మదన్మోహన్, పత్రి నిర్మల దంపతులను పలువురు సత్కరించారు. కీబోర్డుపై కె.రవిబాబు, తబలాపై ఎస్.వెంకట్, ప్యాడ్స్పై కె.చంద్ర, టి.ఈశ్వర్ వాద్య సహకారం అందించారు.









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా పుష్పయాగం - 06.11.2025

వైభవంగా పుష్పయాగం - 06.11.2025 బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ పాలకవర్గం సహాయ, సహకారాలతో కొండబోలు శివరామప్రసాద్, ఉమాశంకర్ దంపతుల సౌజన్యంతో కార్తికమా సాన్ని పురస్కరించుకొని పుష్పయాగం జరిగింది. తొలుత మూలవిరాట్టుకు పవిత్ర జలాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, పూజలు, అలంకరణ జరి గాయి. చామంతి, గులాబీ, లిల్లీ, కలువలు, మల్లెలు, మరువం, జాజి పూలు, తులసీ దళాలతో పుష్ప యాగో త్సవం జరిగింది. ఈసందర్భంగా స్వామివారికి బంగారు పంచె కోసం శివరామప్రసాద్, ఉమాశంకర్ దంప తులు రూ.50 వేలు సమర్పించారు. సాహితీవేత్త నారాయణం ప్రసాదాచార్యులు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మునిపల్లె రమణి భక్తి గీతాలాపన చేశారు.